![]() |
![]() |

ఓ సాధారణ మహిళని అసాధారణలో స్థాయి క్రేజ్ వచ్చేలా చేయాలంటే అది సోషల్ మీడియాకే సాధ్యమవుతుంది. తెలుగునాట సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే ఎందరో ఫేమస్ అయ్యారు. ఇక కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు మారుమోగిపోతోంది. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఓ సాధారణ మహిళ కుమారి ఆంటీ. తనని నేడు సెలబ్రిటీ రేంజ్ కి తీసుకొచ్చారు.
చిన్నా మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా. కుమారి ఆంటీ డైలాగ్.. ఈ ఒక్క డైలాగ్ తో ఇన్ స్టాగ్రామ్ మొత్తం గత రెండు మూడు వారాలుగా ఒక్కటే మ్యూజిక్.. ఎక్కడ చూసిన కుమారి ఆంటీ రీల్స్, మీమ్స్.. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది కుమారి ఆంటి. హైదారాబాద్ లోని ఇనార్బిట్ మాల్ దగ్గరలో ఫేమస్ హోటల్ ITC కోహినూర్ ఉంటుంది. అ హోటల్ కి దగ్గరలో మధ్యాహ్నం టైమ్ లో చిన్న టెంట్ వేసుకొని.. ఫుల్ మీల్స్ తొంభై, భగారా రైస్ అరవై.. అంటూ భోజనం వడ్డిస్తుంది కుమారి ఆంటీ. సాధారణంగా రోడ్డు పక్కన డబ్బులు తీసుకొని భోజనం పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారు. కానీ కుమారి ఆంటీ ఏ ముహుర్తానా ఆ వెయ్యి, రెండు లివర్లు ఎక్స్ ట్రా అందో అక్కడి నుండి ఫుల్ ఫేమస్ అయింది. ఇక ఎక్కడెక్కడి నుండో తన దగ్గరికి భోజనం చేయడానికి వస్తున్నారంట. ఇక అది తెలుసుకొని ఆ ప్లేస్ లో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వచ్చి షాప్ క్లోజ్ చేపించారు. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారిన కుమారి ఆంటీకి.. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుండి సినిమా హీరోల వరకు తమ సపోర్ట్ అందించారు. వీళ్ళతో పాటుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం తన మద్దతు తెలపడం విశేషం. ఆయన చొరవతోనే ఆ షాప్ మళ్ళీ ఓపెనయింది.
ఓ ప్రైవేట్ ఛానెల్ వాళ్ళు కుమారీ ఆంటీని చేసిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన ప్రశ్నని సంధించారు. మీరు ఈటీవీలో ప్రసారం అవుతున్న ' శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి వెళ్తున్నారంట కదా అని వారు అడుగగా.. అదేం లేదండి అని నవ్వుతూ సమాధానమిచ్చింది కుమారీ ఆంటీ. ఒకవేళ ఆ షోకి వెళ్తే డ్యాన్స్ చేస్తారా? స్కిట్ చేస్తారా అని అడుగగా.. ఏమో తెలియదని కుమారీ ఆంటీ అంది. మరి నిజంగానే ఆ షోకి కుమారి ఆంటీ వెళ్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదే నిజమైతే ఇక ఇన్ స్టాగ్రామ్ మీమర్స్ కి పండగే అని నెటిజన్లు భావిస్తున్నారు.
![]() |
![]() |